← Psalms (78/150) → |
1. | నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి |
2. | నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను. |
3. | మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. |
4. | యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. |
5. | రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి |
6. | యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు |
7. | మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును |
8. | ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను |
9. | విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి |
10. | వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి |
11. | ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. |
12. | ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. |
13. | ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను |
14. | పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను |
15. | అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. |
16. | బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను. |
17. | అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. |
18. | వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. |
19. | ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. |
20. | ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి. |
21. | యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. |
22. | వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమి్మక యుంచలేదు. |
23. | అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను |
24. | ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను. |
25. | దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. |
26. | ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను. |
27. | ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను. |
28. | వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను. |
29. | వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. |
30. | వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే |
31. | దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో ¸°వనులను కూల్చెను. |
32. | ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ము కొనక పోయిరి. |
33. | కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి పోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను. |
34. | వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి. |
35. | దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి. |
36. | అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు |
37. | నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి. |
38. | అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు.తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు. |
39. | కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను. |
40. | అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. |
41. | మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. |
42. | ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. |
43. | ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. |
44. | ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను |
45. | ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను. |
46. | ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను. |
47. | వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను. |
48. | వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను. |
49. | ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను. |
50. | తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. |
51. | ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను. |
52. | అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను |
53. | వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. |
54. | తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. |
55. | వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ సింపజేసెను. |
56. | అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి. |
57. | తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి. |
58. | వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి. |
59. | దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను. |
60. | షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. |
61. | ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను. |
62. | తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను |
63. | అగ్ని వారి ¸°వనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను. |
64. | వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. |
65. | అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను. |
66. | ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను. |
67. | పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. |
68. | యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. |
69. | తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను |
70. | తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను. |
71. | పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. |
72. | అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను. |
← Psalms (78/150) → |