← Psalms (59/150) → |
1. | నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము. |
2. | పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము. |
3. | నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు. |
4. | నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము. |
5. | సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.) |
6. | సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు. |
7. | వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. |
8. | యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు. |
9. | నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే. |
10. | నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును. |
11. | వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము. |
12. | వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. |
13. | కోపముచేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము.(సెలా.) |
14. | సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు |
15. | తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు. |
16. | నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చిఉత్సాహగానము చేసెదను |
17. | దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను. |
← Psalms (59/150) → |