← Psalms (52/150) → |
1. | శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. |
2. | మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది |
3. | మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.) |
4. | కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. |
5. | కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.) |
6. | నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి |
7. | ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమి్మక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు. |
8. | నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమి్మక యుంచుచున్నాను |
9. | నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను. |
← Psalms (52/150) → |