← Nehemiah (7/13) → |
1. | నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట |
2. | నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు. |
3. | అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. |
4. | అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు. |
5. | జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. |
6. | జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి |
7. | తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే. |
8. | అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును |
9. | షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును |
10. | ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును |
11. | యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు |
12. | ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును. |
13. | జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును |
14. | జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు |
15. | బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును |
16. | బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును |
17. | అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును |
18. | అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును |
19. | బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును |
20. | అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును |
21. | హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును |
22. | హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును |
23. | జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును |
24. | హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును |
25. | గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును |
26. | బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును |
27. | అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు |
28. | బేతజ్మావెతువారు నలువది యిద్దరును |
29. | కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును |
30. | రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును |
31. | మిక్మషువారు నూట ఇరువది యిద్దరును |
32. | బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును |
33. | రెండవ నెబోవారు ఏబది యిద్దరును |
34. | రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును |
35. | హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు |
36. | యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును |
37. | లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును |
38. | సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు |
39. | యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును |
40. | ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును |
41. | పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును |
42. | హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును |
43. | లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును |
44. | గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును |
45. | ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ |
46. | నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు |
47. | కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు |
48. | లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు |
49. | హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు |
50. | రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు |
51. | గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు |
52. | బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు. |
53. | బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు |
54. | బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు |
55. | బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు |
56. | సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు |
57. | సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు |
58. | యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు |
59. | షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు. |
60. | ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. |
61. | తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. |
62. | వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు |
63. | హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు. |
64. | వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి. |
65. | కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. |
66. | సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది. |
67. | వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి. |
68. | వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును |
69. | వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను. |
70. | పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను. |
71. | మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి. |
72. | మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి. |
73. | అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి. |
← Nehemiah (7/13) → |