← Matthew (18/28) → |
1. | ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, |
2. | ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను |
3. | మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
4. | కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు. |
5. | మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. |
6. | నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. |
7. | అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ |
8. | కాగా నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు. |
9. | నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. |
10. | ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. |
11. | మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల |
12. | తొంబదితొమి్మదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? |
13. | వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమి్మది గొఱ్ఱలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కు వగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
14. | ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. |
15. | మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. |
16. | అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడు నట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. |
17. | అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. |
18. | భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్ప బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
19. | మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. |
20. | ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. |
21. | ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. |
22. | అందుకు యేసు అత నితో ఇట్లనెనుఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. |
23. | కావున పర లోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. |
24. | అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాం తులు2 అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. |
25. | అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమి్మ, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపిం చెను. |
26. | కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా |
27. | ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. |
28. | అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనార ములు3 అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను |
29. | అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడు కొనెను గాని |
30. | వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. |
31. | కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. |
32. | అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; |
33. | నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. |
34. | అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను. |
35. | మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వక ముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను. |
← Matthew (18/28) → |