← Luke (19/24) → |
1. | ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి |
2. | దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు |
3. | యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను. |
4. | అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. |
5. | యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా |
6. | అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. |
7. | అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. |
8. | జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. |
9. | అందుకు యేసుఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. |
10. | నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. |
11. | వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూష లేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, |
12. | రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలె నని దూరదేశమునకు ప్రయాణమై |
13. | తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. |
14. | అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. |
15. | అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమి్మచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. |
16. | మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా |
17. | అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. |
18. | అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా |
19. | అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. |
20. | అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా; |
21. | నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమా లున కట్టి ఉంచితినని చెప్పెను. |
22. | అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా |
23. | నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి |
24. | వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. |
25. | వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. |
26. | అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. |
27. | మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను. |
28. | యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను. |
29. | ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి |
30. | మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు |
31. | ఎవరైననుమీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. |
32. | పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని |
33. | ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. |
34. | అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. |
35. | తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, |
36. | ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి. |
37. | ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు |
38. | ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శ |
39. | ఆ సమూ హములో ఉన్న కొందరు పరిసయ్యులుబోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా |
40. | ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. |
41. | ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి |
42. | నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. |
43. | (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి |
44. | నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. |
45. | ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. |
46. | అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను. |
47. | ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని |
48. | ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. |
← Luke (19/24) → |