← Job (9/42) → |
1. | అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను |
2. | వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? |
3. | వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు. |
4. | ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు? |
5. | వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనేఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే |
6. | భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే |
7. | ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడుఆయన నక్షత్రములను మరుగుపరచును. |
8. | ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడుసముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు. |
9. | ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు. |
10. | ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు. |
11. | ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేనునా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. |
12. | ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు? |
13. | దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. |
14. | కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను? |
15. | నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలనున్యాయకర్తయని1 నేనాయనను బతిమాలుకొనదగును. |
16. | నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చిననుఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. |
17. | ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడునిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు |
18. | ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును. |
19. | బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగానేనే యున్నానని ఆయన యనునున్యాయవిధినిగూర్చి వాదము కలుగగాప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును? |
20. | నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపునునేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును. |
21. | నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.ఏమి చేసినను ఒక్కటే. |
22. | కావునయథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. |
23. | సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. |
24. | భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు? |
25. | పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగాగతించుచున్నవిక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. |
26. | రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును. |
27. | నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా? |
28. | నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను |
29. | నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల? |
30. | నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను |
31. | నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును. |
32. | ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము. |
33. | మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు. |
34. | ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను. |
35. | అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొను చున్నాను. |
← Job (9/42) → |