← Job (41/42) → |
1. | నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా? |
2. | నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? |
3. | అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? |
4. | నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా? |
5. | నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా? |
6. | బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? |
7. | దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా? |
8. | దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. |
9. | దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా. |
10. | దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు? |
11. | నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా |
12. | దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను. |
13. | ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా? |
14. | దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు |
15. | దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి. |
16. | అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు. |
17. | ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి. |
18. | అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి |
19. | దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును. |
20. | ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును. |
21. | దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును |
22. | దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును |
23. | దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు. |
24. | దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. |
25. | అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు. |
26. | దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు. |
27. | ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును. |
28. | బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి. |
29. | దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును. |
30. | దాని క్రిందిభాగములుకరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును. |
31. | కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయునుసముద్రమును తైలమువలె చేయును. |
32. | అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును. |
33. | అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు. |
34. | అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు. |
← Job (41/42) → |