← Job (4/42) → |
1. | దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను |
2. | ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు? |
3. | అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. |
4. | నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. |
5. | అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. |
6. | నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? |
7. | జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? |
8. | నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు. |
9. | దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. |
10. | సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.కొదమ సింహముల కోరలును విరిగిపోవును. |
11. | ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును. |
12. | నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. |
13. | గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను. |
14. | భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. |
15. | ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను. |
16. | అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెనుమెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? |
17. | తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? |
18. | ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. |
19. | జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును? |
20. | ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు. |
21. | వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా. |
← Job (4/42) → |