← Job (36/42) → |
1. | మరియు ఎలీహు ఇంక యిట్లనెను |
2. | కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది. |
3. | దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను. |
4. | నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు. |
5. | ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది. |
6. | భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును. |
7. | నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు. |
8. | వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను |
9. | అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును. |
10. | ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. |
11. | వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. |
12. | వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు. |
13. | అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు. |
14. | కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును. |
15. | శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును. |
16. | అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. |
17. | దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి. |
18. | నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము. |
19. | నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ నిన్ను తప్పించునా? |
20. | జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. |
21. | జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు. |
22. | ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు? |
23. | ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? |
24. | మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము. |
25. | మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు. |
26. | ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. |
27. | ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును |
28. | మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును. |
29. | మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? |
30. | ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును. |
31. | వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు |
32. | ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును |
33. | ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. |
← Job (36/42) → |