← Job (35/42) → |
1. | మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను |
2. | నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే? |
3. | ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? |
4. | నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను. |
5. | ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము. |
6. | నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా? |
7. | నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా? |
8. | నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును. |
9. | అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు. |
10. | అయితేరాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు |
11. | భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు. |
12. | కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు. |
13. | నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. |
14. | ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. |
15. | ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను |
16. | నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు. |
← Job (35/42) → |