← Job (34/42) → |
1. | అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను |
2. | జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి |
3. | అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. |
4. | న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి. |
5. | నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను |
6. | న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు. |
7. | యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు. |
8. | అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను. |
9. | నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. |
10. | విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము |
11. | నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును. |
12. | దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు. |
13. | ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా? |
14. | ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల |
15. | శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు. |
16. | కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము. |
17. | న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా? |
18. | నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? |
19. | రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా? |
20. | వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. |
21. | ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. |
22. | దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు. |
23. | ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యము లేదు. |
24. | విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. |
25. | వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు. |
26. | దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. |
27. | ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి. |
28. | బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి. |
29. | ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడలఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే |
30. | భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు |
31. | ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను |
32. | నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా? |
33. | నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. |
34. | వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు |
35. | యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి |
36. | దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను. |
37. | అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు. |
← Job (34/42) → |