← Job (19/42) → |
1. | అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను |
2. | ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు? |
3. | పదిమారులు మీరు నన్ను నిందించితిరిసిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. |
4. | నేను తప్పుచేసినయెడలనా తప్పు నా మీదికే వచ్చును గదా? |
5. | మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా?నా నేరము నామీద మీరు మోపుదురా? |
6. | ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియుతన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి. |
7. | నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. |
8. | నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు |
9. | ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడుతలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు. |
10. | నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతినిఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను. |
11. | ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. |
12. | ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారముచుట్టు దిగిరి. |
13. | ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడునా నెళవరులు నాకు కేవలము అన్యులైరి. |
14. | నా బంధువులు నాయొద్దకు రాకయున్నారునా ప్రాణస్నేహితులునన్ను మరచిపోయియున్నారు. |
15. | నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగాఎంచెదరునేను వారి దృష్టికి పరదేశినై యున్నాను. |
16. | నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడునేను వాని బతిమాలవలసి వచ్చెను. |
17. | నా ఊపిరి నా భార్యకు అసహ్యమునేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. |
18. | చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరునేను లేచుట చూచినయెడల బాలురు నామీదదూషణలు పలికెదరు. |
19. | నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతినినేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు. |
20. | నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవిదంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది |
21. | దేవుని హస్తము నన్ను మొత్తియున్నదినామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి. |
22. | నా శరీరమాంసము పోవుట చాలుననుకొనకదేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుము దురు? |
23. | నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను. |
24. | అవి యినుపపోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. |
25. | అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. |
26. | ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. |
27. | నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయననుచూచెదనునాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి |
28. | జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొనిమీరుమేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల |
29. | మీరు ఖడ్గమునకు భయపడుడితీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. |
← Job (19/42) → |