← Genesis (10/50) → |
1. | ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. |
2. | యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. |
3. | గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు. |
4. | యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు. |
5. | వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి. |
6. | హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు. |
7. | కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు. |
8. | కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. |
9. | అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు. |
10. | షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. |
11. | ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును |
12. | నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్ట ణము. |
13. | మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను |
14. | పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు. |
15. | కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను |
16. | హివ్వీయులను అర్కీయులను సినీయులను |
17. | అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను. |
18. | తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. |
19. | కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది. |
20. | వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. |
21. | మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. |
22. | షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు. |
23. | అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు. |
24. | అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. |
25. | ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. |
26. | యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును |
27. | హదోరమును ఊజాలును దిక్లాను |
28. | ఓబాలును అబీమాయెలును షేబను |
29. | ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు. |
30. | మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. |
31. | వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు. |
32. | వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను. |
← Genesis (10/50) → |