← Exodus (24/40) → |
1. | మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. |
2. | మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. |
3. | మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. |
4. | మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి |
5. | ఇశ్రాయేలీయులలో ¸°వనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. |
6. | అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. |
7. | అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. |
8. | అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. |
9. | తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి |
10. | ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. |
11. | ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. |
12. | అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా |
13. | మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. |
14. | అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వాం |
15. | మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. |
16. | యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు |
17. | యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను. |
18. | అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను. |
← Exodus (24/40) → |