← Esther (9/10) → |
1. | రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను. |
2. | యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి. |
3. | మొర్దెకైని గూర్చిన భయముతమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి. |
4. | మొర్దెకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానము లన్నిటియందు వ్యాపించెను. |
5. | యూదులు తమ శత్రువుల నందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి. |
6. | షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి. |
7. | హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పదిమంది కుమారులైన పర్షందాతా |
8. | దల్పోను అస్పాతా పోరాతా |
9. | అదల్యా అరీదాతా పర్మష్తా |
10. | అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. |
11. | ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా |
12. | రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును,నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా |
13. | ఎస్తేరురాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడనెను. |
14. | ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి. |
15. | షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. |
16. | రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దిన మందు తమ విరోధులలో డెబ్బది యయిదువేల మందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితేవారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు. |
17. | పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతో షముగా నుండిరి. |
18. | షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దిన మందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి. |
19. | కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి అది విందుచేయదగిన శుభదినమను కొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. |
20. | మొర్దెకై యీ సంగతులను గూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూర ముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి |
21. | యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు |
22. | విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను. |
23. | అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి. |
24. | యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని,పూరు, అనగా చీటి వేయించియుండగా |
25. | ఎస్తేరు, విాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. |
26. | కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు |
27. | యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు, |
28. | పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. |
29. | అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీ హాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదు డైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి. |
30. | మరియు యూదుడైన మొర్దెకైయును రాణియైన ఎస్తేరును యూదు లకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యత యని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా |
31. | ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను. |
32. | ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. |
← Esther (9/10) → |