← Deuteronomy (33/34) → |
1. | దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను |
2. | శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను. |
3. | ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు. |
4. | మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము. |
5. | జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయెను. |
6. | రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. |
7. | యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు. |
8. | లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. |
9. | అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. |
10. | వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు |
11. | యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము. |
12. | బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య2 అతడు నివసించును |
13. | యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన |
14. | సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన |
15. | పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన |
16. | సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. |
17. | అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు. |
18. | జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. |
19. | వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు. |
20. | గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. |
21. | అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచ రించెను. |
22. | దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును. |
23. | నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. |
24. | ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. |
25. | నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. |
26. | యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. |
27. | శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. |
28. | ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. |
29. | ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. శ |
← Deuteronomy (33/34) → |