← Acts (12/28) → |
1. | దాదాపు అదే కాలమందు రాజైన హేరోదుసంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని |
2. | యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. |
3. | ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. |
4. | అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైని కులకు అతనిని అప్పగించెన |
5. | పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. |
6. | హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. |
7. | ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను. |
8. | అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. |
9. | అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను. |
10. | మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను. |
11. | పేతురుకు తెలివివచ్చిప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను. |
12. | ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి. |
13. | అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. |
14. | ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. |
15. | అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. |
16. | పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. |
17. | అతడుఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించియాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి |
18. | తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు. |
19. | హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను. |
20. | తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. |
21. | నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా |
22. | జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. |
23. | అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. |
24. | దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. |
25. | బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి. |
← Acts (12/28) → |