← 2Samuel (2/24) → |
1. | ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. |
2. | కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. |
3. | మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. |
4. | అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. |
5. | సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. |
6. | యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. |
7. | మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను. |
8. | నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి, |
9. | గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. |
10. | సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. |
11. | దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు. |
12. | అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా |
13. | సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా |
14. | అబ్నేరు లేచిమన యెదుట ¸°వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను. |
15. | లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి. |
16. | ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. |
17. | తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి. |
18. | సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక |
19. | అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా |
20. | అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను. |
21. | నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸°వనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా |
22. | అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను. |
23. | అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని |
24. | యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను. |
25. | బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా |
26. | అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను. |
27. | అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి |
28. | బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. |
29. | అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. |
30. | యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి. |
31. | అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి. |
32. | జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. |
← 2Samuel (2/24) → |