← 1Kings (13/22) → |
1. | అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా |
2. | ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రక టనచేసెనుబలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగాదావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును. |
3. | ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను. |
4. | బేతేలునందున్న బలి పీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను. |
5. | మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను. |
6. | అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మును పటివలె ఆయెను. |
7. | అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా |
8. | దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను; |
9. | అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను. |
10. | అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను. |
11. | బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపుర ముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా |
12. | వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశ ములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి. |
13. | పిమ్మట అతడు తన కుమారులను పిలిచినాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి |
14. | మస్తకివృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచియూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? అని అడుగగా అతడునేనే అనెను. |
15. | అప్పుడు అతడునా యింటికి వచ్చి భోజనము చేయుమనగా |
16. | అతడునేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను |
17. | నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను. |
18. | అందుకతడునేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడుయెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా |
19. | అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను. |
20. | వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను. |
21. | అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక |
22. | ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను. |
23. | అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను. |
24. | అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను. |
25. | కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండు టయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. |
26. | మార్గములోనుండి అతని తోడు కొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడుయెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించి యున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి |
27. | తన కుమారులను పిలిచిగాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు |
28. | అతడు పోయి అతని శవము మార్గమందు పడి యుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి |
29. | దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. |
30. | అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి. |
31. | మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టినేను మరణ మైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి, |
32. | యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములో నున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్య ముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. |
33. | ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. |
34. | యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. |
← 1Kings (13/22) → |