← Zechariah (2/14) → |
1. | మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను. |
2. | నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడుయెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను. |
3. | అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదు ర్కొనవచ్చెను. |
4. | రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తార మైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండు నని ఈ ¸°వనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. |
5. | నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు. |
6. | ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు. |
7. | బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. |
8. | సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. |
9. | నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు. |
10. | సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. |
11. | ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు. |
12. | మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. |
13. | సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి. |
← Zechariah (2/14) → |