← SongOfSongs (4/8) → |
1. | నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. |
2. | నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నది. |
3. | నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. |
4. | జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. |
5. | నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి. |
6. | ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. |
7. | నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు. |
8. | ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు. |
9. | నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి. |
10. | సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము. |
11. | ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న ట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది. |
12. | నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము. |
13. | నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు |
14. | జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు. |
15. | నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము. |
16. | ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. |
← SongOfSongs (4/8) → |