← Psalms (99/150) → |
1. | యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును. |
2. | సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. |
3. | భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. యెహోవా పరిశుద్ధుడు. |
4. | యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. |
5. | మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు. |
6. | ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను. |
7. | మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి |
8. | యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి. |
9. | మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. |
← Psalms (99/150) → |