← Psalms (87/150) → |
1. | ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది |
2. | యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి |
3. | దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.(సెలా.) |
4. | రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు. |
5. | ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు. |
6. | యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా.) |
7. | పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం దురు. |
← Psalms (87/150) → |