← Psalms (81/150) → |
1. | మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి. |
2. | కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయిం చుడి. |
3. | అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. |
4. | అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. |
5. | ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. |
6. | వారి భుజమునుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను. |
7. | ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని.(సెలా.) |
8. | నా ప్రజలారా, ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల ఎంత మేలు! |
9. | అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ కూడదు. |
10. | ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను. |
11. | అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. |
12. | కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని. |
13. | అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! |
14. | అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును. |
15. | యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును. |
16. | అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. |
← Psalms (81/150) → |