← Psalms (79/150) → |
1. | దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు. |
2. | వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎర గాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి యున్నారు. |
3. | ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టువారెవరును లేరు. |
4. | మా పొరుగువారికి మేము అసహ్యులమైతివిు మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు. |
5. | యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా? |
6. | నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. |
7. | వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు |
8. | మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము |
9. | మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. |
10. | వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. |
11. | చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము. |
12. | ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము. |
13. | అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. |
← Psalms (79/150) → |