← Psalms (48/150) → |
1. | మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు. |
2. | ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వ తము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది |
3. | దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు. |
4. | రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. |
5. | వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి. |
6. | వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేద నయు వారిని పట్టెను. |
7. | తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టు చున్నావు. |
8. | సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా.) |
9. | దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివిు. |
10. | దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది. |
11. | నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. |
12. | ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి |
13. | దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. |
14. | ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును. |
← Psalms (48/150) → |