← Psalms (22/150) → |
1. | నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? |
2. | నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు. |
3. | నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. |
4. | మా పితరులు నీయందు నమి్మక యుంచిరి వారు నీయందు నమి్మక యుంచగా నీవు వారిని రక్షించితివి. |
5. | వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమి్మక యుంచి సిగ్గుపడకపోయిరి. |
6. | నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. |
7. | నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. |
8. | యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు. |
9. | గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా నాకు నమి్మక పుట్టించితివి. |
10. | గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవునీవే. |
11. | శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము. |
12. | వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. |
13. | చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు |
14. | నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలెకరగియున్నది. |
15. | నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు. |
16. | కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. |
17. | నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు |
18. | నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. |
19. | యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. |
20. | ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. |
21. | సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించినాకుత్తరమిచ్చి యున్నావు |
22. | నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. |
23. | యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడియాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడిఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకుభయపడుడి |
24. | ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు.వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. |
25. | మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దనుఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. |
26. | దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరుమీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. |
27. | భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు |
28. | రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. |
29. | భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగువారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు |
30. | ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. |
31. | వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు. |
← Psalms (22/150) → |