← Psalms (20/150) → |
1. | ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. |
2. | పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాకసీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక. |
3. | ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక. |
4. | నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. |
5. | యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక. |
6. | యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియునురక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును. |
7. | కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురుమనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. |
8. | వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. |
9. | యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక. |
← Psalms (20/150) → |