← Psalms (2/150) → |
1. | అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? |
2. | మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు |
3. | భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినివిరోధముగా నిలువబడుచున్నారుఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. |
4. | ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడుప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు |
5. | ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును |
6. | నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను |
7. | కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను. |
8. | నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగానుభూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. |
9. | ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు |
10. | కాబట్టి రాజులారా, వివేకులై యుండుడిభూపతులారా, బోధనొందుడి. |
11. | భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి. |
12. | ఆయన కోపము త్వరగా రగులుకొనునుకుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు. |
← Psalms (2/150) → |