← Psalms (19/150) → |
1. | ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. |
2. | పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. |
3. | వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. |
4. | వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. |
5. | అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. |
6. | అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. |
7. | యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. |
8. | యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును. |
9. | యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. |
10. | అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. |
11. | వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. |
12. | తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము. |
13. | దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును. |
14. | యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక. |
← Psalms (19/150) → |