← Psalms (140/150) → |
1. | యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. |
2. | వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. |
3. | పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.) |
4. | యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపా డుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షిం పుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు. |
5. | గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.) |
6. | అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. |
7. | ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు. |
8. | యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా.) |
9. | నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక |
10. | కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక |
11. | కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక. |
12. | బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగు దును. |
13. | నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. |
← Psalms (140/150) → |