← Psalms (14/150) → |
1. | దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు. |
2. | వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను |
3. | వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు |
4. | యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. |
5. | ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు |
6. | బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. |
7. | సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. |
← Psalms (14/150) → |