← Psalms (137/150) → |
1. | బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి. |
2. | వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు. |
3. | అచ్చట మనలను చెరగొన్నవారుఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి |
4. | అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? |
5. | యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక. |
6. | నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. |
7. | యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసి కొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. |
8. | పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు |
9. | నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు. |
← Psalms (137/150) → |