← Psalms (129/150) → |
1. | ఇశ్రాయేలు ఇట్లనును నా ¸°వనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి |
2. | నా ¸°వనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. |
3. | దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి. |
4. | యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు. |
5. | సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. |
6. | వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును |
7. | కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు. |
8. | దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు. |
← Psalms (129/150) → |