← Psalms (121/150) → |
1. | కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? |
2. | యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. |
3. | ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. |
4. | ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు |
5. | యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. |
6. | పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. |
7. | ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును |
8. | ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును |
← Psalms (121/150) → |