Psalms (12/150)  

1. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరివిశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
2. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురుమోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
3. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినిబింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
4. మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.
5. బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదనురక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అనియెహోవా సెలవిచ్చుచున్నాడు.
6. యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.
7. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవుఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించె దవు.
8. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడుదుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

  Psalms (12/150)