← Psalms (118/150) → |
1. | యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము...... నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి |
2. | ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. |
3. | ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. |
4. | ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. |
5. | ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను |
6. | యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? |
7. | యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. |
8. | మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. |
9. | రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. |
10. | అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
11. | నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
12. | కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. |
13. | నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. |
14. | యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. |
15. | నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. |
16. | యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. |
17. | నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. |
18. | యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. |
19. | నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. |
20. | ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. |
21. | నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. |
22. | ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. |
23. | అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము |
24. | ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. |
25. | యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. |
26. | యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము. |
27. | యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. |
28. | నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. |
29. | యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. |
← Psalms (118/150) → |