← Psalms (115/150) → |
1. | మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక |
2. | వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? |
3. | మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు |
4. | వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు |
5. | వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు |
6. | చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు |
7. | చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. |
8. | వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. |
9. | ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము |
10. | అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము |
11. | యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. |
12. | యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును |
13. | పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. |
14. | యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. |
15. | భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. |
16. | ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. |
17. | మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు |
18. | మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి. |
← Psalms (115/150) → |