← Psalms (109/150) → |
1. | నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము |
2. | నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. |
3. | నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు |
4. | నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను. |
5. | నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు. |
6. | వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక. |
7. | వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక |
8. | వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక. |
9. | వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక |
10. | వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక |
11. | వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక |
12. | వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక |
13. | వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక |
14. | వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక |
15. | ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు చుండునుగాక. |
16. | ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. |
17. | శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. |
18. | తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది |
19. | తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక. |
20. | నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము. |
21. | యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. |
22. | నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది. |
23. | సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు |
24. | ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. |
25. | వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు |
26. | యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు |
27. | నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము. |
28. | వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. |
29. | నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక |
30. | నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. |
31. | దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు. |
← Psalms (109/150) → |