← Proverbs (25/31) → |
1. | ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. |
2. | సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత. |
3. | ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. |
4. | వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును. |
5. | రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును. |
6. | రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము. |
7. | నీ కన్నులు చూచిన ప్రధానియెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. |
8. | ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. |
9. | నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము. |
10. | బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచు నేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుం డును. |
11. | సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది. |
12. | బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు. |
13. | నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును. |
14. | కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు. |
15. | దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును. |
16. | తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో |
17. | మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో. |
18. | తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. |
19. | శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము. |
20. | దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు. |
21. | నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము |
22. | అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. |
23. | ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. |
24. | గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు |
25. | దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుం డును. |
26. | కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. |
27. | తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కార ణము. |
28. | ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. |
← Proverbs (25/31) → |