← Proverbs (12/31) → |
1. | శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు |
2. | సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును. |
3. | భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు |
4. | యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు. |
5. | నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. |
6. | భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును. |
7. | భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును. |
8. | ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడ బడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును. |
9. | ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు. |
10. | నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. |
11. | తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. |
12. | భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపే క్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును. |
13. | పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. |
14. | ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. |
15. | మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. |
16. | మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. |
17. | సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. |
18. | కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. |
19. | నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. |
20. | కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు. |
21. | నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. |
22. | అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. |
23. | వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. |
24. | శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. |
25. | ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును. |
26. | నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. |
27. | సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. |
28. | నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. |
← Proverbs (12/31) → |