← Numbers (33/36) → |
1. | మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. |
2. | మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. |
3. | మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. |
4. | అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. |
5. | ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. |
6. | సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి. |
7. | ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. |
8. | పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. |
9. | ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి. |
10. | ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి. |
11. | ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. |
12. | సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి |
13. | దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. |
14. | ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. |
15. | రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. |
16. | సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి. |
17. | కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. |
18. | హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. |
19. | రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. |
20. | రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి. |
21. | లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. |
22. | రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి. |
23. | కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. |
24. | షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి. |
25. | హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. |
26. | మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. |
27. | తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి. |
28. | తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. |
29. | మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి. |
30. | హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. |
31. | మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. |
32. | బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. |
33. | హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. |
34. | యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. |
35. | ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. |
36. | ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి. |
37. | కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. |
38. | యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను. |
39. | అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను. |
40. | అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. |
41. | వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. |
42. | సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి. |
43. | పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. |
44. | ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి. |
45. | ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి. |
46. | దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. |
47. | అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి. |
48. | అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. |
49. | వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి. |
50. | యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. |
51. | నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత |
52. | ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి |
53. | ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని. |
54. | మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. |
55. | అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. |
56. | మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము. |
← Numbers (33/36) → |