← Numbers (3/36) → |
1. | యెహోవా సీనాయికొండమీద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. |
2. | అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే. |
3. | ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠిం చెను. |
4. | నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి. |
5. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి |
6. | వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. |
7. | వారు ప్రత్యక్షపు గుడా రము నెదుట మందిరపు సేవచేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను. |
8. | మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీ యులు కాపాడవలసిన దంతటిని, వారే కాపాడవలెను. |
9. | కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారు లకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు. |
10. | నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. |
11. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా |
12. | ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు. |
13. | ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను. |
14. | మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. |
15. | లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను. |
16. | కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. |
17. | లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి. |
18. | గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి. |
19. | కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి. |
20. | మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. |
21. | లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే. |
22. | వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది. |
23. | గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. |
24. | గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. |
25. | ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు |
26. | ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును. |
27. | కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు. |
28. | ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి. |
29. | కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు. |
30. | కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. |
31. | వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు. |
32. | యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త. |
33. | మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు. |
34. | వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది. |
35. | మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు. |
36. | మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని |
37. | దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు. |
38. | మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును. |
39. | మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది. |
40. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలు కొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. |
41. | నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువు లను నా నిమిత్తము తీసి కొనవలెను. |
42. | కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారి నందరిని లెక్కించెను. |
43. | వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు. |
44. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను |
45. | నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీ యులు నా వారైయుందురు; నేనే యెహోవాను. |
46. | ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను. |
47. | పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను. |
48. | తులము ఇరువది చిన్న ములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. |
49. | కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను. |
50. | పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను. |
51. | యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను. |
← Numbers (3/36) → |