← Mark (3/16) → |
1. | సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. |
2. | అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. |
3. | ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి |
4. | వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి. |
5. | ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. |
6. | పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. |
7. | యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, |
8. | మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. |
9. | జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. |
10. | ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి. |
11. | అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. |
12. | తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. |
13. | ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి. |
14. | వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు |
15. | అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. |
16. | వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను |
17. | జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. |
18. | అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, |
19. | ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. |
20. | ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. |
21. | ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. |
22. | యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జె బూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. |
23. | అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? |
24. | ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. |
25. | ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు. |
26. | సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును. |
27. | ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. |
28. | సమస్త పాపములును మను ష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని |
29. | పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. |
30. | ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. |
31. | ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. |
32. | వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా |
33. | ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని |
34. | తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; |
35. | దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను. |
← Mark (3/16) → |