← Mark (15/16) → |
1. | ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి. |
2. | పిలాతుయూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయననీవన్నట్టే అని అతనితో చెప్పెను. |
3. | ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా |
4. | పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. |
5. | అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను. |
6. | ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. |
7. | అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను. |
8. | జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా |
9. | ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని |
10. | పిలాతు తెలిసికొనినేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను. |
11. | అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. |
12. | అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను. |
13. | వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి. |
14. | అందుకు పిలాతుఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. |
15. | పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. |
16. | అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమ కూర్చుకొనినతరువాత |
17. | ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి, |
18. | యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. |
19. | మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమి్మవేసి, మోకాళ్లూని ఆయనకు నమ స్కారముచేసిరి. |
20. | వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయు టకు తీసికొనిపోయిరి. |
21. | కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయు టకు అతనిని బలవంతముచేసిరి. |
22. | అతడు అలెక్సంద్రు నకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. |
23. | అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు. |
24. | వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచు కొనిరి. |
25. | ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమి్మది గంటలాయెను. |
26. | మరియుయూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి. |
27. | మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని |
28. | ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి. |
29. | అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, |
30. | సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి. |
31. | అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. |
32. | ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి. |
33. | మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. |
34. | మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. |
35. | దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి. |
36. | ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను. |
37. | అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. |
38. | అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. |
39. | ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. |
40. | వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. |
41. | ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూష లేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి. |
42. | ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము |
43. | గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. |
44. | పిలాతుఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతినితన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. |
45. | శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. |
46. | అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. |
47. | మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి. |
← Mark (15/16) → |