Luke (22/24)  

1. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీ పించెను.
2. ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపా యము వెదకుచుండిరి.
3. అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవే శించెను
4. గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజ కులతోను అధిపతులతోను మాటలాడెను.
5. అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
6. వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
7. పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
8. యేసు పేతురును యోహానును చూచిమీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
9. వారుమేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా
10. ఆయనఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి
11. నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
12. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను.
13. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
14. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.
15. అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
16. అది దేవుని రాజ్య ములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి
17. ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిమీరు దీనిని తీసి కొని మీలో పంచుకొనుడి;
18. ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను.
19. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు తులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాప కము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.
20. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.
21. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది.
22. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవు చున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను.
23. వారుఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి.
24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా
25. ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉప కారులనబడుదురు.
26. మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.
27. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను.
28. నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;
29. గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,
30. సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియ మించుచున్నాను.
31. సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
32. నీ నమి్మక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
33. అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
34. ఆయనపేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
35. మరియు ఆయనసంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారుఏమియు తక్కువకాలేదనిరి.
36. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమి్మ కత్తి కొనుక్కొనవలెను;
37. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను
38. అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.
39. వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా--చాలునని ఆయన వారితో చెప్పెను.
40. తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
41. ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
42. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
43. తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.
44. అప్పుడు పర లోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.
45. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.
46. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
47. మీరెందుకు నిద్రించు చున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
48. ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా
49. యేసు యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించు చున్నావా అని వానితో అనగా
50. ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.
51. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను.
52. అయితే యేసుఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
53. యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోనుమీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా?
54. నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
55. వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను.
56. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండి నప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను.
57. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.
58. అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
59. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
60. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడునిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.
61. అందుకు పేతురుఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.
62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురునేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసిక
63. వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.
64. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,
65. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిఒ ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
66. ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
67. నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయననేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
68. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
69. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
70. అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయనమీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
71. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.

  Luke (22/24)