← Leviticus (7/27) → |
1. | అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా |
2. | దహనబలి పశువులను వధించుచోట అప రాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. |
3. | దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును |
4. | రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను. |
5. | యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; |
6. | అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను. |
7. | పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. |
8. | ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును. |
9. | పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును. |
10. | అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను. |
11. | ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా |
12. | వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను. |
13. | ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. |
14. | మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. |
15. | సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. |
16. | అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. |
17. | మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను. |
18. | ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరిం చును. |
19. | అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన కూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని |
20. | ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహో వాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును. |
21. | ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్ర మైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంస మును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. |
22. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను |
23. | నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తిన కూడదు. |
24. | చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు. |
25. | ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. |
26. | మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. |
27. | ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. |
28. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను |
29. | నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్ని ధికి తేవలెను. |
30. | అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. |
31. | యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. |
32. | సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను. |
33. | అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును. |
34. | ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను. |
35. | వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలోనుండినది అభిషేక మునుబట్టి అహరోనుకును అభి షేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను. |
36. | వీటిని ఇశ్రాయేలీ యులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్ట డగా నియమించెను. |
37. | ఇది దహనబలిని గూర్చియు అప రాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధ పరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి. |
38. | ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను. |
← Leviticus (7/27) → |