← Leviticus (24/27) → |
1. | మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను |
2. | దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. |
3. | ప్రత్యక్షపు గుడార ములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగు నట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. |
4. | అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. |
5. | నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. |
6. | యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను. |
7. | ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవాయెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. |
8. | యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. |
9. | అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. |
10. | ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. |
11. | ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమారె |
12. | యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి. |
13. | అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. |
14. | శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను. |
15. | మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. |
16. | యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. |
17. | ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. |
18. | జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. |
19. | ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. |
20. | విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను. |
21. | జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను. |
22. | మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను. |
23. | కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెనుశపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. |
← Leviticus (24/27) → |