← Joshua (4/24) → |
1. | జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను |
2. | ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి |
3. | యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము |
4. | కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి |
5. | వారితో ఇట్లనెనుయొర్దాను నడుమనున్న మీ దేవు డైన యెహోవా మంద సము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను. |
6. | ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. |
7. | అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును, |
8. | అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. |
9. | అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి. |
10. | ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. |
11. | జనులందరు దాటిన తరువాత వారు చూచుచుం డగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. |
12. | మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి. |
13. | సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి. |
14. | ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయు లందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. |
15. | యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని |
16. | ఆజ్ఞాపించు మని యెహోషువతో సెలవియ్యగా |
17. | యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆ యాజకుల కాజ్ఞా పించెను. |
18. | యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. |
19. | మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా |
20. | వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి |
21. | ఇశ్రాయేలీయులతో ఇట్లనెనురాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా; |
22. | అప్పుడు మీరుఇశ్రా యేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. |
23. | ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసు లందరు తెలిసికొనుటకును, |
24. | మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను. |
← Joshua (4/24) → |